బ్లూమింగ్టన్‌లో నాట్స్ విభాగం ప్రారంభం

Featured Image

అమెరికావ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉన్న అక్కడ తమ శాఖలను విస్తరిస్తున్న నాట్స్ సంస్థ శనివారం నాడు ఇల్లినాయిస్ రాష్ట్రం బ్లూమింగ్టన్‌లో తన కొత్త విభాగాన్ని ప్రారంభించింది. సలహాదారులుగా వేణుకుమార్ మద్దినేని, కృష్ణ వైట్ల, సమన్వయకర్తగా చింటా విజయ్ కృష్ణలు వ్యవహరించనున్నారని అధ్యక్షుడు మందాడి శ్రీహరి తెలిపారు. జాయింట్ కో ఆర్డినేటర్లుగా ప్రేమేష్ గోగినేని, భరత్ అబ్బూరి, మహిపాల్ రెడ్డి గసిరెడ్డి, మహిళా సమన్వయకర్తగా సుష్మ గుడలు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

స్థానికంగా తెలుగు సంఘాల సహకారంతో ఈ నాట్స్ విభాగం కార్యక్రమాలు చేపడుతుందని బ్లూమింగ్‌టన్ నాట్స్ నాయకులు తెలిపారు. నూతన విభాగ ఏర్పాటు పట్ల బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, మాజీ అధ్యక్షుడు పాములపాటి మదన్‌లు అభినందనలు తెలిపారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-NATS Starts Illinois Bloomington Chapter

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles