చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాఠశాలకు చేయూత

Featured Image

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమానికి చేయూతగా అమెరికాకు చెందిన చేతన ఫౌండేషన్, ఆ సంస్థ కెనడా ప్రతినిధి నెమలిపురి సీతారామారావులు ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రింటర్, సౌండ్ సిస్టమ్‌ను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే చేతన ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెనిగళ్ల రవి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీతారామారావు కోరారు. ముత్తినేని సురేష్, స్వప్న, శ్రీ వత్స, ప్రియ, చంద్రకాని నవీన్, షేక్ రషీద్, ఏఏపీసీ ఛైర్మన్ పి. రాజ్యం, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాస్, కె.వి. రమణ, ఉపాధ్యాయులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags-Chetana Foundation Helps Khammam Rural Govt School

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles