సిలికాన్ వ్యాలీ సత్యనారాయణ స్వామి ఆలయంలో పుష్కరోత్సవం

Featured Image

సిలికాన్ వేలీలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాంతలో పుష్కరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ఆలయంలో దేవతా మూర్తుల ప్రాణ ప్రతిష్టకు 12 వసంతాలు పూర్తైన సందర్భంగా ఈ ఉత్సవం ప్రత్యేకంగా జరిపారు. బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకట శాస్త్రి మార్గదర్శకత్వంలో ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటిరోజు 140 పైగా దంపతులచే నిర్వహించిన శ్రీసూక్త హోమం, 27 సార్లు పారాయణతో అమెరికాలోనే ప్రత్యేకంగా నిలిచింది. 116 వెండి కలశాలతో కుంభాభిషేకం జరిపారు.

రెండవ రోజు దేవతామూర్తులకు మూలమంత్ర హోమాలు, అభిషేకాలు, సాయంత్రం మహానారాయణ హోమం, ఉపనిషత్తుల పారాయణతో సాగిన హోమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. మూడవ రోజు అరుణపారాయణతో హోమం, అనంతరం ఆలయ కుంభాభిషేకం, విష్ణుసహస్రనామ హోమం, కళ్యాణోత్సవంతో ముగిసిన ఈ ఉత్సవాల్లో దాదాపు ఐదువేల మంది భక్తులు ప్రతిరోజూ పాల్గొన్నారు. ఆలయ యాజమాన్యం గోపాల్ ఆధ్వర్యంలో భోజనాలు, సౌకర్యాలు, రంగవల్లులు వంటి ఏర్పాట్లు చేపట్టారు.

రెండవ రోజు మిల్పిటాస్ మేయర్, కాంగ్రెస్ సభ్యులు తదితరులు విచ్చేసి ఆలయ సేవలను కొనియాడారు. మారేపల్లి నాగవేంకట శాస్త్రి ఆలయం స్థాపన నుండి అభివృద్ధి విశేషాలను పంచుకుంటూ, V.E.D.A. ఉద్దేశ్యాల గురించి వివరించారు. దాతలకు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Silicon Valley Satyanarayana Swamy Temple Pushkarotsavam

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles