టెక్సాస్ పాఠశాలల నుండి తెలుగులో ఈమెయిళ్లు

Featured Image

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ పరిసర ప్రాంతాల్లో తెలుగువారి ప్రాముఖ్యత పెరిగిందనడానికి నిదర్శనంగా విద్యార్థులకు, పాఠశాలలకు సంబంధించిన సమాచారం తల్లిదండ్రులకు తెలుగులో ఈమెయిళ్లు పంపిస్తున్నారు.

డల్లాస్ పరిసర ప్రాంతమైన ప్రాస్పర్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లోని హాల్ ప్రాథమిక పాఠశాల సిబ్బంది కొందరు అస్వస్థతకు గురయ్యారు. వీరికి వైద్య సహాయం అందించే నిమిత్తం అత్యవసర వైద్యబృందాన్ని పాఠశాలకు పిలిచారు. పాఠశాలలో జరిగే ఇలాంటి సంఘటనలపై సాధారణంగా అమెరికావ్యాప్తంగా ఆయా పాఠశాలలు తల్లిదండ్రులకు ఈమెయిళ్ల ద్వారా సమాచారాన్ని పంపుతారు. ఈ ఈమెయిళ్లు ఆంగ్లంలో ఉంటాయి. కానీ దీనికి విరుద్ధంగా హాల్ ప్రాథమిక పాఠశాల నుండి తల్లిదండ్రులకు తెలుగులో ఈమెయిల్ రావడంతో ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు హర్షం వెలిబుచ్చుతున్నారు. ప్రాస్పర్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో అత్యధికులు మాట్లాడే 70 భాషల్లో తెలుగు ప్రథమ స్థానంలో ఉందనేది గమనార్హం.

Tags-Prosper ISD Sending Telugu Emails To Parents

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles