
'వైల్డ్ బ్రీత్ ' ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల

కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేదని ప్రముఖ నటుడు శివాజీరాజా అన్నారు. 'రేవు' వంటి మంచి మూవీని నిర్మించిన సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుండి 'వైల్డ్ బ్రీత్' చిత్రాన్ని ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రకటీంచారు. ఈ చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్నారు. డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు.
వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో శివాజీరాజా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరయ్యారు. శివాజీరాజా మాట్లాడుతూ – నాకు ఎంతో సన్నిహితులైన మీడియా మిత్రులు ఉన్నారు. నేను కెరీర్ ప్రారంభం నుంచీ వారితో స్నేహం చేస్తున్నా. అలాంటి మీడియా మిత్రుల్లో ఒకరైన పర్వతనేని రాంబాబు నిర్మాతగా వైల్డ్ బ్రీత్ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ మధ్య కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలెన్నో విజయాలు సాధిస్తున్నాయి. వైల్డ్ బ్రీత్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగున్నాయి. పర్వతనేని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన నిర్మాతగా ఎన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా. దర్శకుడు హరినాథ్ పులి మంచి పేరు తెచ్చుకోవాలి. స్టార్స్ అవసరం లేదు. స్టార్స్ వెంట పడటం కాదు కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. శివ మల్లాల, నారాయణరాజు, హేమసుందర్, కేశవ, శక్తిమాన్, రాధాకృష్ణ, మూర్తి మల్లాల తదితరులు పాల్గొన్నారు.
టెక్నికల్ టీమ్
బ్యానర్ – సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు – డా.మురళీ చంద్ గింజుపల్లి, పర్వతనేని రాంబాబు
రచన, దర్శకత్వం – హరినాథ్ పులి
డీవోపీ – రేవంత్ సాగర్
మ్యూజిక్ – వైశాక్ మురళీధరన్
ఎడిటింగ్ – శ్రీహరి సురేష్
ఆర్ట్ – మల్టీ వినోద్ రావెల
ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ – సూర్యతేజ సి. గాజుల
Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org
Tags-Revu Movie Producer Ginjupalli Murali Announces Wild Breath First Look, Samhith Entertainments, Revu Telugu Movie, WildBreathMovie
bodyimages:

Latest Articles
- Nats Starts Illinois Bloomington Chapter
- International Yoga Day 2025 In Washington Dc By Nris
- Tana Swararaagavadhaanam By Garikapati Venkata Prabhakar In Dallas
- Ashtavadhanam In Nats 2025 Conference Tampa Florida
- Silicon Valley Satyanarayana Swamy Temple Pushkarotsavam
- Nda Alliance First Anniversary Celebrations In Germany
- Harishrao Meets With Nri Brs Reps Globally Via Zoom Along With Mahesh Bigala
- Nats Telugu Iowa Financial Seminar 2025
- Full List Of Candidates In Tana 2025 Elections
- Manchester Ct Shirdi Saibaba Temple Opening Celebrations