చంద్రబాబుతో కొల్లా అశోక్ భేటీ - నైపుణ్యాభివృద్ధి శిక్షణపై చర్చ

Featured Image

ప్రకాశం జిల్లాకు చెందిన డల్లాస్ ప్రవాసాంధ్రుడు కొల్లా అశోక్ మంగళవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణనిచ్చే తరగతుల నిర్వహణకు ప్రభుత్వ సహకారాన్ని కోరారు.

అఖిలభారత సాంకేతిక విద్యామండలి (AICTE) గుర్తింపు పొందిన గుంటూరులో నెలకొల్పిన FAANG Tech Lab సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(LMS) ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఐటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ విభాగాల్లో శిక్షణ ఇస్తామని తద్వారా విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి బాటలు ఏర్పడతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అశోక్ వివరించారు. FAANG Tech Lab నుండి ఆ సంస్థ వ్యవస్థాపకుడు జిల్లెళ్లమూడి వెంకట్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ ల్యాబ్‌లోనే నిర్వహించే ఈ శిక్షణా తరగతుల ద్వారా విద్యార్థుల ఇంజినీరింగ్ కోర్సు పూర్తి అయ్యే సమయానికి క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాన్ని సాధించే స్థాయికి ఎదిగేలా పాఠ్యాంశాలను రూపొందించినట్లు చంద్రబాబుకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఈ ప్రతిపాదనను సదరు ప్రభుత్వ విభాగానికి సిఫార్సు చేశారని అశోక్-జిల్లెళ్లమూడి వెంకట్ తెలిపారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Kolla Ashok Babu Meets Chandrababu Over Skill Development Training

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles