ఫ్రిస్కో హనుమాన్ ఆలయంలో మహాకుంభాభిషేకం

Featured Image

ప్రవాస భారతీయులు, తెలుగువారు అధికంగా నివసించే డల్లాస్ పరిసర ప్రాంతమైన ఫ్రిస్కోలో మైసూరు అవధూత దత్తపీఠ వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువుదీరాడు.

ఆగష్టు 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహాకుంభాభిషేక వేడుకల్లో భాగంగా స్వామివారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని శనివారం నాడు శాస్త్రోక్తంగా, వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీవారికి తొలి అభిషేకం, హారతిని సచ్చిదానంద స్వామిజీ నిర్వహించారు. ఈ వారం రోజుల క్రతువులో భాగంగా నిర్వహించిన హోమాలు, యజ్ఞాలు, శ్రీచక్రపూజ, కలశాభిషేకం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో డల్లాస్ నుండే గాక అమెరికా నలుమూలలతో పాటు కెనడా నుండి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సచ్చిదానంద స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందజేశారు.

Tags-Venkateswara Temple Opened In Frisco KSHT

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles