నాట్స్ సంబరాల ప్రాథమిక షెడ్యూల్ వచ్చేసింది!

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల సందడికి సంబంధించిన ప్రాథమిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. బ్యాంక్వెట్ విందు, నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, హాస్య నాటికలు, స్థానిక ప్రవాసుల ప్రతిభా ప్రదర్శన, ఆధ్యాత్మిక, శాస్త్రీయ సంగీత, రాజకీయ, వైద్య, వ్యాపార విభాగాలకు చెందిన వైవిధ్యభరిత కార్యక్రమాలతో ఈ సంబరాలు ఉత్సాహంగా సాగనున్నాయని సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరిలు తెలిపారు. ఈ వేడుకల్లో బుల్లితెర నటీనటులచే సాంస్కృతిక కార్యక్రమాలు, హీరోయిన్ల నాట్యాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రవాసులు ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో పాల్గొనేందుకు వీలుగా సంబరాల టికెట్ల ధరలను సైతం సరసమైన ధరలకు ఏర్పాటు చేశారు. పెద్దలకు $75, 4-12 ఏళ్ల వయస్సు కలిగినవారికి $25, 3 అంతకన్నా తక్కువ వయస్సున్న వారికి ఉచితంగా సంబరాలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు వీరు తెలిపారు. దిగువ QR కోడ్ ద్వారా లేదా www.sambaralu.org/buynow ద్వారా కొనుగోలు చేయవచ్చునని వెల్లడించారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-NATS 8th America Telugu Sambaralu Events Schedule

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles