రేపు ఇంకొల్లులో DVR Sainik School ప్రారంభోత్సవం

Featured Image

డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఛైర్మన్‌గా బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్మించిన Dr.DVR Sainik Schoolను మంగళవారం నాడు ఐటీ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. 1981లో విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తల ఆలోచనకు కార్యరూపంగా ఏర్పాటు అయిన 'ఇంకొల్లు ప్రాంతీయ విద్యా వైజ్ఞానికాభివృద్ధి సంఘం' ఆధ్వర్యంలో ఈ పాఠశాల నిర్వహిస్తున్నారు. 8 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు కానున్న ఈ పాఠశాలలో పలు ఆధునిక వసతులతో పాటు విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసే మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు డా. దగ్గుబాటి తెలిపారు.

మంగళవారం నాటి కార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షత వహిస్తారని, మంత్రులు గొట్టిపాటి, అనగాని, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తదితరులు పాల్గొంటారని పాఠశాల కరెస్పాండెంట్ దగ్గుబాటి హితేష్ చెంచురామన్, సమన్వయకర్త గోరంట్ల సుబ్బారావులు వెల్లడించారు.

https://drdvrssainikschool.com/

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Dr DVR Sainik School Opening On June 23rd

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles