పెద్దిబోయిన జోగేశ్వరరావుకు జీవిత సాఫల్య పురస్కారం

Featured Image

డెట్రాయిట్‌లోని సౌత్‌ఫీల్డ్ పావిలియన్‌లో శనివారం నాడు నిర్వహించిన కేరళ క్లబ్ 50వ వార్షికోత్సవంలో జోగేశ్వరరావు పెడ్డిబోయినకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు.

కోవిడ్-19 కాలంలో ఆయన నిర్వహించిన కార్యక్రమాలు, వివిధ కమ్యూనిటీల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టడం, డిటిఏ (DTA) అధ్యక్షుడిగా సేవలు, ఐఎల్ఏ (ILA) వైస్ ప్రెసిడెంట్, సాయిబాబా దేవాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, ఎస్వీ టెంపుల్ బోర్డు మెంబర్, ఐటీ సర్వ్ అధ్యక్షుడిగా, కేరళ క్లబ్ నిర్వహించే "అడాప్ట్-ఎ-రోడ్" కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించినందుకు, ఆహార, వస్త్ర దాన కార్యక్రమాల నిర్వహణకు సహకరించినందుకు ఆయనను ఈ పురస్కారం వరించింది. తనకు ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందని, తన బాధ్యతను మరింత పెంచిందని జోగేశ్వరరావు అన్నారు. 2015లో తానా ప్రాంతీయ ప్రతినిధిగా, తానా సభల నిర్వాహక కమిటీ సభ్యుడిగా, ఈ ఏడాది జులై 3,4,5 తేదీల్లో నిర్వహిస్తున్న తానా సభల కోశాధికారిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Jogeswararao Peddiboyina Felicitated By Kerala Club Detroit

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles