DVR Sainik School ప్రారంభించిన లోకేష్-చిత్రమాలిక

Featured Image

చదువుకున్న యువత రాజకీయాల్లోకి వచ్చి దేశసేవకి అంకితం కావాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకొల్లులో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ఆయన ప్రారంభించారు. స్కూల్ ప్రధాన భవనం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, బాలుర, బాలికల వసతి గృహాలు, క్యాంటీన్, మెస్ భవనాలను డీవీఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్‌తో కలిసి మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను ఆవిష్కరించారు.

గురువులను దేవుడితో సమానంగా గౌరవించాలని లోకేష్ తెలిపారు. తల్లుల త్యాగాల వల్లే మనం చదువుకోగలుగుతున్నాం, ఈ స్థాయికి చేరుకుంటున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ తల్లులను గౌరవించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడంపై లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. పెదనాన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పెద్దమ్మ దగ్గుబాటి పురందేశ్వరి, వారి పిల్లలు హితేష్, నివేదిత అద్భుతమైన విద్యాసంస్థలు నెలకొల్పారని కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ కుటుంబం పనిచేయడం సంతోషమన్నారు. గొప్ప సైనికులను ఈ సైనిక్ స్కూల్ అందిస్తుందని ఆకాంక్షించారు

మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే ఎంఎమ్ కొండయ్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళీ, బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Lokesh Inaugurates Dr DVR Sainik School In Bapatla Inkollu

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles