అమెరికాలో ఇరువురు తెలుగు వ్యక్తులు మృతి

🕑 Published: May 01, 2026 at 12:18 PM CST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందు (26) అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన చందు.. మాస్టర్స్‌ చేసేందుకు కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. షికాగోలోని డిపాల్‌ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తిచేసిన ఆయన.. ఫుల్‌టైమ్‌ జాబ్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. చందు భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు స్నేహితులు, తెలుగు సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో పనిచేస్తున్న సురేష్‌ కుమార్‌ (41) అనే తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న సురేష్‌ను ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధరించారు. గుండెపోటు కారణంగా సురేష్‌ చనిపోయినట్లు తెలుస్తోంది. సురేష్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. వీరిలో ఏడేళ్ల అబ్బాయికి ప్రత్యేక వైద్య సేవలు అవసరం. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

📲 Join Our WhatsApp Channel
తానా ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవంఐర్లాండ్‌లో వాసవీ అమ్మవారి జన్మదినోత్సవంTable Tennis Tournament By ATA Delaware Valleyలండన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలుప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడండిసింగపూర్ ప్రవాసులతో మంత్రి సత్యకుమార్ భేటీCAA ఆధ్వర్యంలో చికాగోలో వైభవంగా సీతారామ కళ్యాణంఆటా 19వ మహాసభల నిధుల సేకరణకు డాలస్‌లో విశేష స్పందనATA 19th Convention Fundriser In New Jersey Rises 625K USDఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైల ఆసక్తి-కోమటి జయరాంన్యూయార్క్‌లో పంచెకట్టు ఫ్యాషన్ షో అదరహో!వర్జీనియాలో మైనర్లపై లైంగిక వేధింపులు...తెలుగు వ్యక్తికి 20ఏళ్ల జైలుశిక్షజర్మనీలో చంద్రబాబు జన్మదినోత్సవం..పాల్గొన్న మంత్రి భరత్నేడు వర్జీనియాలో కోమటి జయరాం పర్యటనవిద్యార్థుల్లో సామాజిక స్పృహ కల్పిస్తున్న నాట్స్ సేవా కార్యక్రమాలుNCAIA Holi Celebrations in WashingtonATA Convention Meet and Greet Kickoff In Harrisburg PA25న నెబ్రాస్కా తెలుగు సమితి ఉగాదిహాంకాంగ్‌లో వైభవంగా ఉగాది వేడుకలుసెయింట్‌లూయిస్‌లో చంద్రబాబు జన్మదినోత్సవం
Previous Article Next Article