🕑 Published: July 25, 2026 at 04:34 PM CST
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గ్లోబల్ విస్తరణలో భాగంగా బెల్జియంలో బీఆర్ఎస్ పార్టీ 54వ ఎన్నారై శాఖను బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు(కేటీఆర్) 50వ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ అభివృద్ధికి, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కేటీఆర్ నాయకత్వాన్ని కొనియాడుతూ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, బీఆర్ఎస్ సిద్ధాంతాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు నిర్వహించారు.
బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ, బెల్జియం బీఆర్ఎస్ శాఖను బలోపేతం చేసేందుకు తాత్కాలిక అడహాక్ కమిటీని జగన్నాథ్ ప్రసాద్ రామానుజం నాయకత్వంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన అనంతరం పూర్తి స్థాయి కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, మనోజ్, మంజునాథ్, విజయ్, రాజశేఖర్, ఫణి, హరీష్, నాగరాజు జగిని, శ్రీకాంత్, అఖిల్ రెడ్డి, భాను, చన్నా రెడ్డి, రమణ్ పాల్గొన్నారు.

