🕑 Published: August 15, 2026 at 07:52 PM CST
బీటా థలస్సీమియా మేజర్‌తో పోరాడిన సాకేత్ కొల్లా స్మారకార్థం ఏర్పాటు చేసిన సాకేత్ ఫౌండేషన్ 15వ వార్షిక 5కే వాక్ శనివారం నాడు ఫ్రిస్కో కామన్స్ పార్కులో నిర్వహించారు. ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు అందజేశారు. ఈ వాక్ ద్వారా ₹15లక్షలు($16వేల డాలర్లు) అందినట్లు సాకేత్ తల్లిదండ్రులు శ్రీనివాస్-లక్ష్మీలు తెలిపారు. సాకేత్ స్ఫూర్తిని స్మరించుకుంటూ, భారతదేశంలోని ఆర్థికంగా వెనుకబడిన పిల్లల ఆరోగ్యం, విద్య కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు: www.sakethfoundation.org చూడవచ్చు.



