నెబ్రాస్కాలో వైభవంగా తెలుగు బడి వార్షికోత్సవం

🕑 Published: May 23, 2026 at 07:51 AM CST

Telugu Samiti of Nebraska-TANA Paatasalaల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు బడి వార్షికోత్సవం గత శనివారం ఘనంగా నిర్వహించారు.

2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫైనల్ పరీక్షలను విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేయగా, మొత్తం 62 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు.

తెలుగు సమితి అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ మాట్లాడుతూ ప్రారంభం నుండి ముగింపు వరకు తానాతోసాగిన ఈ ప్రయాణం రెండు సంస్థల మధ్య నమ్మకాన్ని, అనుబంధాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ముఖ్యంగా తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలతో తప్పకుండా తెలుగులో మాట్లాడాలని సూచించారు. మన భాషే మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు మూలాలకు ప్రతిబింబమని, తెలుగు మాట్లాడటం ద్వారా పిల్లలు తమ వారసత్వానికి మరింత దగ్గరవుతారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రధానోపాధ్యాయులు వేణు మురకొండ కృషి చేశారు. గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను శ్వేత బొడెపూడి, పావులూరి సత్యనారాయణ, నవీన్ కంటెం, నాగరాజు ముద్దెల్లిలు విద్యార్థులకు అందజేసి, తెలుగు భాషను ఆసక్తిగా నేర్చుకుని ధైర్యంగా మాట్లాడాలని ప్రోత్సహించారు.

తెలుగు బడి ఉపాధ్యాయులు రాజా, ఉమా, పవిత్ర, దివ్య, సుధీర్, స్వప్న, వీణామాధురి, సువర్ణరేఖ, మౌనిక, సుహిత, తనూజ తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్ల పంపిణీ అనంతరం పిల్లల కోసం ఫేస్ పెయింటింగ్, సరదా ఆటలు మరియు వినోద కార్యక్రమాలు నిర్వహించారు.

📲 Join Our WhatsApp Channel
కొలంబియా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో కీలకోపన్యాసం చేసిన సరయు బేతెంచర్లవైభవంగా నెబ్రాస్కా తెలుగు సమితి ఉగాదికాన్సాస్‌లో మురళీమోహన్‌కు స్వర్ణ సత్కారంజీయర్ ట్రస్ట్-నాట్స్‌ల ఆధ్వర్యంలో సీతారామా కళ్యాణంఅనంతవరం వెంకన్న ఆలయ పంచతల రాజగోపురం నిర్మాణానికి తితిదే బోర్డు ఆమోదంఅమెరికా పార్కుల్లో తెలుగు కబుర్లు-TNI ప్రత్యేకంDeepica Mutyala Inspires UT McCombs Graduatesడా. నోరికి తెలుగు కళాసమితి ఉగాది పురస్కారంSaanvi Gullapalli Donates 5000 USD To North Texas FoodBankసింగపూర్‌లో 409వ సారి భాగవత సప్తాహం చేసిన వద్దిపర్తిA HUB GLOBAL Hosts Investor Launch of "Yadadri Hills"ATA Conducts Chess Tournament Successfully in Extonతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో వీలునామాపై అవగాహన సదస్సుడల్లాస్‌లో "అమానా" ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ వేడుకలుతెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026వరంగల్ రైతు సభను విజయవంతం చేయండి - ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ సప్తమ వార్షికోత్సవంవేడుకగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంటెక్సాస్ తెలుగు ఐటీ కంపెనీల్లో హెచ్-1బీ అవకతవకలపై అటార్నీ జనరల్ దర్యాప్తుఅమెరికాలో ఇరువురు తెలుగు వ్యక్తులు మృతి
No Previous Next Article