🕑 Published: August 16, 2026 at 08:00 PM CST
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవాలు ఫోర్ట్ బెండ్ ఎపిక్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండల ఆధ్వర్యంలో యాభై ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని సావనీర్ రూపంలో ప్రచురించారు. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అవసరాల శ్రీనివాస్, వామరాజు సత్యమూర్తి, బలభద్రపాత్రుని రమణి తదితర సాహితీ లబ్దప్రతిష్ఠులు సందడి చేశారు. సంస్థ ఏళ్ళ ప్రస్థానంపై ‘స్వర్ణ వైభవం’ పేరిట చేసిన ప్రదర్శన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
రాజేంద్ర ప్రసాద్, అలీ, నవీన్ పొలిశెట్టి, రీతూ వర్మ, గాయకులు సునీత, కృష్ణ చైతన్య, ఇన్ ఫ్యూషన్ బృంద ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఐరాసలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ముఖ్యఅతిథిగా, హ్యూస్టన్ భారత కాన్సులెట్ జనరల్ మంజునాథ్లు అతిథులుగా పాల్గొన్నారు. జితేందర్ రెడ్డి, యాదగిరిరెడ్డి, ముత్యాల పద్మశ్రీ మార్గనిర్దేశం చేశారు.