శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్‌

Featured Image

శంకర నేత్రాలయ మిచిగన్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడో వార్షిక 5K వాక్ నిర్వహించారు. స్థానిక నోవై నగరంలోని ఐటీసీ స్పోర్ట్స్ పార్క్‌ దీనికి వేదిక అయింది. ఈ కార్యక్రమాన్ని డెట్రాయిట్ చాప్టర్ తరఫున ట్రస్టీలు ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి, చాప్టర్ లీడ్స్ వెంకట్ గోటూరు, విజయ్ పెరుమాళ్ళ, వాలంటీర్లు సాయి గోపిశెట్టి, సుజాత తమ్మినీడి, తేజ జెట్టిపల్లి, వంశీ గోపిశెట్టి, మరియు యూత్ వాలంటీర్లు సమన్వయపరిచారు. శంకర నేత్రాలయ ప్రెసిడెంట్ డాక్టర్ బాలరెడ్డి ఇందుర్తి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ సూచనలు చేశారు. టి. త్యాగరాజన్ సాంకేతిక సహాయం అందజేశారు. శంకర నేత్రాలయ చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాల గురించి అందరికీ చేశారు.ఈ సందర్భంగా పాత, కొత్త మెంబర్లు 5K వాక్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శంకర నేత్రాలయ యూఎస్‌ఏ ఫౌండర్ ఎస్వీ ఆచార్య డెట్రాయిట్ చాప్టర్ బృందానికి తమ అభినందనలు తెలిపారు. శంకర నేత్రాలయ USA ప్రెసిడెంటు బాలరెడ్డి ఇందుర్తి, కార్యదర్శి వంశీకృష్ణ ఎరువారం, కోశాధికారి మూర్తి రేకపళ్ళి, స్పోర్ట్స్‌ కమిటీ ఛైర్‌ రమేశ్ చాపరాల, వాలంటరీ కమిటీ ఛైర్‌ రత్నకుమర్ కవుటూరు తమ సహాయ సహకారాలను అందించారు. 5K వాక్ ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా శంకర నేత్రాలయ నిర్వహిస్తున్న కార్యక్రమాలకి తమ వంతు సహాయాన్ని అందిస్తూ విరాళాలు అందజేశారు.

ఈ కార్యక్రమం విజయవంతమవడానికి పలువురు ఆర్థిక సాయం అందించి ఉపకరించారు (రెస్టౌరెంట్ రావుగారి విందు, స్వీట్ టైంస్, SPARC, మెగాస్టార్ ఫ్యాన్స్, ప్రసాద్ కాట్రగడ్డ, శ్రీదేవి గోగినేని). నోవై హైస్కూల్ విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేశారు. 5K వాక్‌లో విజేతలకు బహుమతులు అందజేశారు. శంకర నేత్రాలయ గురించి వివరాలు వారి వెబ్ సైట్ sankaranethralayausa.org నుంచి తెలుసుకోవలసిందిగా కోరారు.

Tags-Detroit Sankara Netralaya 5K Walk

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles