తానా రెండోరోజు వేడుకల్లో సినీప్రముఖుల సందడి

Featured Image

డెట్రాయిట్ నగరంలో జరుగుతున్న తానా 24వ ద్వైవార్షిక మహాసభల రెండోరోజు వేడుకల్లో భాగంగా సాయంకాల కార్యక్రమాల్లో సినీతారలు సందడి చేశారు. ఐశ్వర్య రాజేష్, నిఖిల్, రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, యెర్నేని నవీన్ తదితరులను సత్కరించారు. అనంతరం వారు ప్రసంగించారు. దేశం కాని దేశంలో మనదనే సంస్కృతి కోసం 48ఏళ్లుగా నిలబడటం గర్వించాల్సిన విషయమని కొనియాడారు.

ఫ్యాషన్ షో, సాంస్కృతిక ప్రదర్శనలు, సునీత్-ఎస్పీ చరణ్‌ల సంగీత విభావరి ఆకట్టుకుంది. సుమ వ్యాఖ్యాతగా రక్తికట్టించారు. సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్, కన్వీనర్ ఉదయకుమార్ చాపలమడుగు, సభల కార్యవర్గ సభ్యులు పంత్ర సునీల్, కిరణ్ దుగ్గిరాల, పెద్దిబోయిన జోగేశ్వరరావు, నీలిమ మన్నే తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రఘురామరాజు, మురళీమోహన్, కె.వి.రావు, కోమటి జయరాం, వేమన సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags-TANA 2nd Day Prime Time Graced By Tollywood - Detroit Telugu TANA 2025 24th Conference News Gallery

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles