మలేషియాలో అన్నమయ్య జిల్లా వాసి మృతి. రెండు నెలల అనంతరం ఇంటికి చేరుకున్న మృతదేహం.

Featured Image

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె, కొన్నయ్యగారిపల్లి గ్రామానికి చెందిన బొమ్మవరం శంకరమ్మ డిసెంబరు 21న కోలాలంపూర్లో హృద్రోగంతో కన్నుమూశారు.

ఇండియన్ ఎంబసీ సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ ఉపాధ్యక్షుడు కృష్ణ ముత్తినేని మృతుని కుటుంబ వివరాలు అవసరమైన దస్తావేజులను సేకరించారు. మలేసియా ఎయిర్ లైన్స్ విమానంలో శంకరమ్మ మృతదేహాన్ని చెన్నైకి చేర్చారు. APNRT సీఈఓ డాక్టర్ పి.కృష్ణమోహన్ విమానాశ్రయం నుండి వారి గ్రామానికి ఉచితంగా అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ మృతదేహాన్ని తరలించడానికి అవసరమైన మొత్తం ఖర్చును మలేషియాలోని ఇండియన్ ఎంబసీ పూర్తిగా భరించిందని వారికి, ఇండియన్ హైకమిషనర్ బి.ఎన్.రెడ్డికి ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ అధ్యక్షుడు బూరెడ్డి మోహనరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Tags-Annamayya District Woman Dies in Malaysia

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles