జర్మనీలో వారం రోజుల పాటు చంద్రబాబు జన్మదిన వేడుకలు

Featured Image

జర్మనీలోని హాంబర్గ్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఆదివారం నాడు నిర్వహించారు. ఈ వేడుకలను జర్మనీలోని పలు నగరాల్లో ఎన్ఆర్ఐ టిడిపి-జర్మనీ విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించనున్నట్టు ప్రతినిధులు తెలిపారు. హాంబర్గ్ లో జరిగిన కార్యక్రమానికి డాక్టర్ శివశంకర్ లింగం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, మాజీ mlc ఏఎస్ రామకృష్ణలు హాజరయ్యారు.

జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లి గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం నేతలు కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ లకు చంద్రబాబు చేసిన సేవల్ని కొనియాడారు. హాంబర్గ్ టీడీపీ టీం శశిధర్ ఏమిరెడ్డి, విక్రమ్ తల్లపనేని, దినేష్ పాకలపాటి, కిషోర్ దాసుగారి, అఖిల్ ప్రసన్న దున్న, శ్రీకాంత్ గోళ్ళ, ఉజ్వల్ మారెడ్డి, ఫ్రాంక్ఫర్ట్ నుండి శ్రీకాంత్ కుడితిపూడి, మునిచ్ నుండి నరేష్ కోనేరు, పలువురు తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags-Chandrababu Birthday Celebrations In Hamburg Germany

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles