రామాయణంపై సింగపూర్‌లో మేడసాని మోహన్ ప్రవచనం

Featured Image

శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో సింగపూర్లో, పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్ శ్రీమద్రామాయణ వైశిష్ట్యంపై మూడు రోజులపాటు ప్రవచించారు. అయిదు వేదికలపై, అయిదు భాగాలుగా, 15గంటలపాటు మొత్తం రామాయణంలోని ఏడు కాండలపై ఆయన ప్రసంగించారు. వాల్మీకి రామాయణంలోని సంస్కృత శ్లోకములు, తెలుగులో రామాయణ కల్పవృక్షము, భాస్కర రామాయణము వంటి వాటినుండి తెలుగు పద్యములు ఉదహరిస్తూ, కథను ఆసక్తికరంగా వర్ణిస్తూ, రామాయణంలో నిక్షిప్తమైన ఎన్నో అంశాలను, జీవన విధానానికి తోడ్పడే నైతిక సూత్రాలను రామాయణ గాథతో మేళవించి మేడసాని తన ప్రవచనంతో ఆలోచింపజేశారు.

ప్రొఫెసర్ బి వి ఆర్ చౌదరి, రాజ్యలక్ష్మి, కళాసారథి సభ్యులు రాధిక మంగిపూడి, సుబ్బు పాలకుర్తి, సౌభాగ్యలక్ష్మీ, రాజశేఖర్ తంగిరాల, మాధవి, సత్య జాస్తి, సరిత, రామాంజనేయులు చామిరాజు, రేణుక, రంగా ప్రకాష్ కాండూరి, తేజశ్వనిలు వేదికల ఏర్పాటుకు సహకరించారు. కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ ధన్యవాదాలు తెలిపారు. కృష్ణకాంతి, స్నిగ్ద ఆకుండి, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, కాండూరి శ్రీసన్వి, శ్రీధన్వి, షర్మిల చిత్రాడలు రామనామ కీర్తనలు ఆలపించారు. సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు ప్రకాశరావు, రంగా రవి, సభ్యులు లక్ష్మీనారాయణ, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, పాతూరి రాంబాబు, శ్రీధర్ భారద్వాజ్, గుంటూరు వెంకటేష్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.

Tags-Medasani Mohan Pravacanam on Ramayanam in Singapore

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles