దుబాయిలో ఆదిలాబాద్ యువకుల దారుణ హత్య

Featured Image

దుబాయ్‌లో ఇద్దరు తెలంగాణ వాసులు దారుణ హత్యకు గురయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ప్రేమ్‌సాగర్‌, శ్రీనివాస్‌ అనే ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్తానీ యువకుడు హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఈ డబుల్‌ మర్డర్‌ కేసులో మతోన్మాదం ఉందనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి చెందిన శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడ ఓ బేకరీలో పలువురు యువకులతో కలిసి పని చేస్తున్నారు. అదే బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన పలువురు యువకులు ఉండడం ఇద్దరు ప్రాణాలను బలిగొంది. పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. సడెన్‌గా మత పరమైన నినాదాలు చేస్తూ ప్రేమ్‌సాగర్‌, శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డారు. దాంతో.. దుండగుడి చేతిలో ఇద్దరూ మృతి చెందగా.. మరో ఇద్దరు తెలుగువాళ్లు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించిన దుబాయ్‌ పోలీసులు.. పాకిస్తాన్‌కు చెందిన హంతకుడిని అరెస్ట్‌ చేశారు. మతపరమైన దాడుల ఆరోపణల నేపథ్యంలో మరికొందరు పాకిస్తానీయుల కోసం దుబాయ్‌ పోలీసులు గాలిస్తున్నారు.

Tags-Adilabad Youth Murdered In Dubai By Pakistani

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles