లోకేష్ అమెరికా పర్యటన విజయవంతం చేయండి - కోమటి జయరాం

Featured Image

నవ్యాంధ్రకు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ నెల అమెరికాలో పర్యటించనున్న ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల్లో కూటమి విజయానికి సహకరించిన ప్రవాసులకు 6వ తేదీన డల్లాస్‌లో నిర్వహించే సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయవల్సిందిగా ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త కోమటి జయరాం కోరారు. డిసెంబరు 6వ తేదీన డల్లాస్‌లో ప్రవాసాంధ్రులతో జరిగే సమావేశానికి పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు, అభిమానులు, ప్రవాసులు హాజరై తమ సంఘీభావాన్ని తెలపాలని కోరారు. అమెరికావ్యాప్తంగా ఉన్న ఎన్నారై తెదేపా కార్యకర్తలు ఈ సమావేశం విజయవంతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 3వ తేదీ నుండి తాను డల్లాస్‌లో అందుబాటులో ఉంటానని జయరాం తెలిపారు. 8,9 తేదీల్లో కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ అవుతారు.

Tags-Komati Jayaram Requests NRTs Participation Nara Lokesh Dallas Tour

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles