హోరాహోరీగా 'తాల్' 2025 బ్యాడ్మింటన్ పోటీలు

Featured Image

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో ఆదివారం నాడు లండన్‌లోని UEL స్పోర్ట్స్ & అథ్లెటిక్స్ సెంటర్ లో నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించారు. 200 మందికి పైగా ఆటగాళ్లు వివిధ విభాగాలలో తలపడ్డారు. పురుషుల డబుల్స్, 40+ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్, 16 ఏళ్లు లోపు పిల్లల విభాగాలలో ఈ పోటీలు నిర్వహించారు. TAL చైర్మన్ రవి సబ్బా మాట్లాడుతూ, ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిని అభినందించి, ప్రవాసులను ఒకేచోట చేర్చేందుకు TAL చేసిన కృషిని కొనియాడారు. స్పాన్సర్స్‌కి ధన్యవాదాలు తెలిపారు.

2025 పోటీల కోఆర్డినేటర్లు సుధాకర్ గుబ్బల, బాలాజీ కల్లూర్, అనిల్ అనంతుల(ట్రస్టీ – మెంబర్షిప్ & అడ్మిన్), శ్రీదేవి అల్లెదుల్ల (ట్రస్టీ – సాంస్కృతిక), సింధూరా రెడ్డి (మహిళల క్రీడల ఇన్‌చార్జ్), సత్య పెదిరెడ్డి (క్రీడల ఇన్‌చార్జ్), గిరిధర్ పుట్లూర్ (మాజీ ట్రస్టీ), కృష్ణ నూతలపాటి, అనిల్ రెడ్డి, దివ్యా రెడ్డి తదితరులు సహకరించారు. 2025 సంవత్సరానికి "ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్" అవార్డు మిస్ ఆస్రిత కొల్లూరు కు ప్రదానం చేశారు.

Category Winners Runners-up

గర్ల్స్ డబుల్స్ (<16) ఆస్రిత కొల్లూరు & ద్రిషాన గౌరిషన్ శ్రేయ వడ్లమాని & లలిత ఒరుగంటి

మహిళల డబుల్స్ కాశి బాయి & జ్యోత్స్నా చుకారియా శ్వేత కాంత రెడ్డి & రాధిక కాంత రెడ్డి

మిక్స్డ్ డబుల్స్ అమర్ చౌదరీ & కాశి బాయి సాయికిరణ్ & ద్రిషాన గౌరిషన్

పురుషుల 40+ డబుల్స్ శ్రీరామ్ గిడుగు & రాకేష్ బొరంచ రాజేష్ చిట్టినేని & సుదేష్ రెడ్డి

పురుషుల డబుల్స్ రవి తేజ అడిగోపుల & మనోభి రామ్ అమర్ చౌదరీ & సాయికిరణ్

Tags-London TAL 2025 Badminton Championship Winners

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles