
చికాగో ఆంధ్ర సంఘం 9వ వార్షికోత్సవ వేడుకలు

చికాగో ఆంధ్ర సంఘం 9వ వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 27న Napervilleలోని YellowBox ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు శ్రీకృష్ణ మతుకుమల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, కార్యవర్గ సభ్యులు సమన్వయపరిచారు. ప్రవాస అతిథులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా చికాగో భారత కాన్సులేట్ కాన్సుల్ జనరల్ సోమనాథ్ ఘోష్ పాల్గొన్నారు. పహల్గామ్ ఘటనను ఖండించారు. తీవ్రవాదులపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రదాడిలో మృతి చెందినవారికి నివాళి అర్పించారు.
జీవిత సాఫల్య పురస్కారాన్ని Dr.శ్రీరామ్ శొంఠి మరియు Dr. శారద పూర్ణ సుసర్ల శొంఠిలకు అందజేశారు. 260 కళాకారుల 40కుపైగా ప్రదర్శనలు, నృత్యరూపకాలు, “ఏమి తింటే తగ్గుతాం” వంటి వినోదాత్మక అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనూష బెస్తా, స్మిత నందూరి, శైలజ సప్ప వేడుకలను ప్రారంభించారు. మాలతి - పద్మాకర్ దామరాజు ఆధ్వర్యంలో తెలుగు భోజనం అందజేశారు.
CAF (Chicago Andhra Foundation) సేవా కార్యక్రమాలపై సునీత రాచపల్లి విజువల్ ప్రెజెంటేషన్ చేశారు. రమ్య రోడ్డం రూపొందించిన చిత్రాన్ని వేలంలో ఉత్సాహంగా కొనుగోలు చేశారు. CAA Mobile Appను పరిచయం చేశారు. శృతి కూచంపూడి ప్రత్యక్ష ప్రసారానికి సాంకేతిక ఏర్పాట్లు చేశారు. కార్యదర్శి స్మిత నండూరి అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ గీతంతో వేడుకలను ముగించారు.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-Chicago Andhra Assoc CAA 9th Anniversary
Gallery









Latest Articles
- Nats Frisco Adopt A Street Cleans Roads
- Ata Hosts Aapi Delegation In Dc
- Justice Br Gavay Releases Book By Ex Cji Justice Nv Ramana
- Chicago Nats Cleans Highways
- Philadelphia Nats Donates 8000 To Feed The Poor
- Ata 2025 Mothers Day In Houston
- Santha Biotech Varaprasad Reddy Meets Sankara Netralaya Usa Team
- Nats Dallas Helps Feed 62 Poor Kids For One Year
- Dont Shop Via Social Media Trump Administration Booking Cases On Tax Evasion
- Tantex 213Th Nntv Ugadi Kavisammelanam 2025