లోకేష్‌తో కలిసి కాలిఫోర్నియాలో పర్యటించిన మన్నవ మోహనకృష్ణ

Featured Image

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన వ్యాపార సమావేశాల్లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో లోకేష్ అమెరికాలో పలువురు టెక్నాలజీ, తయారీ, కమ్యూనికేషన్ రంగాల కంపెనీల ఉన్నతాధికారులతో వరుసగా సమావేశమయ్యారని చెప్పారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూల కేంద్రంగా మలచేందుకు ఈ చర్చలు దోహదపడతాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జరిగిన చర్చల్లో విశాఖపట్నంలో ప్రతిపాదిత AI డేటా సెంటర్ మరియు ఇతర పెట్టుబడులపై పురోగతి పరిశీలించారని మన్నవ మోహన కృష్ణ తెలిపారు. ఇంటెల్‌ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో జరిగిన భేటీలో రాష్ట్రంలో అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP) యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాలపై, ఎన్‌విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్ మిర్ పూరి, అడోబ్ సీఈఓ శంతను నారాయణన్‌తో జరిగిన సమావేశాల్లో గేమింగ్‌, చిప్ డిజైన్‌, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారని ఆయన వివరించారు.

జూమ్ వీడియో కమ్యూనికేషన్స్‌ ప్రొడక్ట్, ఇంజినీరింగ్ విభాగం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అమరావతి లేదా విశాఖలో ఆర్‌అండ్‌డీ/ఇంజినీరింగ్ డెవలప్‌మెంట్ సెంటర్ మరియు విశాఖలో జీసీసీ ఏర్పాటు చేసే విషయంపై లోకేష్ ప్రతిపాదనలు ఉంచినట్లు మోహన కృష్ణ చెప్పారు. ఈ పర్యటనలో జరిగిన చర్చలు ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్ పెట్టుబడుల మార్గాన్ని బలోపేతం చేస్తాయని మన్నవ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఈ పర్యటన ఉపయోగకరంగా నిలిచిందని ఆయన అన్నారు.

Tags-APTS Chairman Mannava Mohanakrishna Tours SFO With Nara Lokesh

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles