వర్జీనియాలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

Featured Image

కాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని కళ్య్నోత్సవాన్ని వర్హీనియాలో వైభవంగా నిర్వహించారు. తిరుమలను మరిపించేలా అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును కన్నులపండువగా నిర్వహించారు. వేదిక పరిసరాలు గోవింద నామాలతో మార్మోగాయి. స్వామివారికి మంగళ స్నానాల అనంతరం పల్లకి సేవలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేదికను రంగురంగుల తోరణాలు, పూలతో తీర్చిదిద్దారు.

ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు అభిషేకం, అర్చన వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ హారతులు, ప్రవాస చిన్నారులు అన్నమయ్య కీర్తనలు భక్తి పారవశ్యాన్ని కలిగించాయి. తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. చంద్ర మలవతు, డా. మధుసూదన్ రెడ్డి కాశీపతి సమన్వయపరిచారు. వర్జీనియా కాంగ్రెస్ ప్రతినిధి సుహాస్ సుబ్రహ్మణ్యం, సతీష్ వేమన, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags-Sreenivasa Kalyanam In Virginia By Capital Area Rayalaseema Assoc

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles