తానా ఎన్నికల్లో సెలక్షన్ల సందడి-TNI ప్రత్యేకం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లో 2025 ఎన్నికల్లో తదుపరి నేతాగణాల ఎంపిక సందడి నెలకొంది. సంస్థ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉన్నదనే కారణంగా...తానా రాజ్యాంగంలో మార్పుల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిని పక్కనబెట్టి ఈ ఏడాది సెలక్షన్ పద్ధతిలో కార్యవర్గాన్ని ఎంపిక చేస్తున్నారు. వడ్డించేవాడు మనోడైతే సామెత రీతిన...తానాలో అనుయాయులకు సెలక్షన్ పద్ధతిలో పదవులు కట్టబెట్టడం కొత్త కానప్పటికీ రాజ్యాంగాన్నే మార్పు చేసి రాచమార్గంలో అధికారికంగా పదవుల పంపిణీకి తెరచాపలెత్తడం 48 సంవత్సరాల సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి.

ఇప్పటివరకు ఇద్దరు అభ్యర్థులు అధ్యక్ష స్థానానికి నామినేషన్లు వేసినట్లు సమాచారం. రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆ పదవికి రాజీనామా చేసి అట్లాంటాకు చెందిన బోర్డు సభ్యుడు లావు శ్రీనివాస్, తానా మాజీ కార్యదర్శి కొల్లా అశోక్‌బాబులు అధ్యక్ష స్థానానికి నామినేషన్లు దాఖలు చేసినట్లు వినికిడి. అధ్యక్ష స్థానంతో పాటు కార్యదర్శి, కోశాధికారి, ప్రాంతీయ ఉపాధ్యక్షులు, బోర్డు, ఫౌండేషన్లలో పలు పదవులకు కూడా తానా మాజీలు, కొత్త సభ్యులు, పదవుల ప్రేమికులు, ఇసుమంత సేవాతత్పరత కలిగిన పరమాత్ములు కొందరు తమ దరఖాస్తులను 2025 ఎన్నికల కమిటీకి పంపించారు. వీరిలో నుండి సెలక్షన్ కమిటీ ఎవరికి పట్టం కడుతుందనే తెలియాల్సి ఉంది.

--సుందరసుందరి(sundarasundari@aol.com)

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-TANA 2025 Election Selection Updates

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles