ఉప్పుటూరి సేవా ట్రస్ట్‌కు చంద్రబాబు ప్రశంసలు

Featured Image

గుంటూరు జిల్లా పుల్లడిగుంట మాజీ జడ్పీటీసీ ఉప్పుటూరి సీతామహలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె భర్త చినరాములు ఉప్పుటూరి సేవా ట్రస్ట్ ద్వారా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు ప్రతిదినం అన్నదానం చేస్తున్నారు. బుధవారం నాడు చినరాములు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉప్పుటూరి ట్రస్టు సేవా కార్యక్రమాలను అభినందించారు. తమ కుమారుడు రామ్‌చౌదరి అన్న క్యాంటీన్ నిర్వహణకు ఆర్థిక తోడ్పాటు ఇస్తున్నారని ఈ సందర్భంగా చినరాములు సీఎంకు వివరించారు. సేవా కార్యక్రమాల విస్తృతిని పెంచాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు.

Tags-AP CM Chandrababu Appreciates Guntur Upputuri ChinnaRamulu Trust Charity Activities

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles