
తానా 24వ మహాసభలకు సర్వం సిద్ధం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) జులై 3,4,5 తేదీల్లో నిర్వహించనున్న 24వ మహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్ తెలిపారు. నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
గాయని చిత్ర, తమన్, సునీత, ఎస్.పి.చరణ్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. హీరోయిన్ సమంత అమెరికాలో తెలుగు మహాసభలకు తొలిసారిగా తానాకు వస్తున్నారని ఆయన వెల్లడించారు. హీరోయిన్ ఐశ్వర్యరాజేష్ కూడా హాజరవుతున్నారు. సెలబ్రిటీలతో మీట్ అండ్ గ్రీట్, అన్నమాచార్య స్వరార్చన పేరుతో శోభారాజు కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. వీరితో పాటు సాహిత్యం, రాజకీయ రంగాల ప్రముఖులు ఇప్పటికే డెట్రాయిట్‌కు చేరుకున్నారు. వేడుకలు, అతిథుల ఏర్పాట్లను సమన్వయకర్త ఉదయకుమార్ చాపలండుగు, డైరక్టర్ పంత్ర సునీల్, కిరణ్ చౌదరి, పెద్దిబోయిన జోగేశ్వరరావు, మన్నే నీలిమలు సమన్వయపరుస్తున్నారు.
Tags-All Set For TANA 2025 Conference In Detroit
Gallery


Latest Articles
- Chinnajeeyar Swamyji First Scotland Tour 2025 Jetuk
- New Jersey Ata Board Meeting 2025
- Nori Dattatreyudu Appointed Advisor To Telangana Govt
- Raghavendrarao Muralimohan Ttd Chairman Brnaidu To Receive Tana Awards 2025
- Faang Tech Quantum Computing Training To Rural Students Via Iit Support
- Thaman Reaches Tampa Grand Welcome By Pinnamaneni Prasanth
- Penamaluru Nri Tagore Mallineni Selected As Tana Foundation Trustee
- Tana Sahityamlo Hasyam 2025
- Telugu Origin Ravada Chandrasekhar Appointed As Kerala Dgp
- Nats Celebrity Cricket League 2025 In Tampa Telugu Sambaralu