అట్లాంటా ప్రవాసులను మైమరిపించిన చెంచులక్ష్మి నృత్య నాటిక

Featured Image

అమెరికాలోని అట్లాంటాకు చెందిన నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో చెంచు లక్ష్మి నృత్య నాటిక ఏర్పాటు చేశారు. ఈ నాటిక ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అడవి నేపథ్యంలో నరసిమ్హస్వామి లక్ష్మీ దేవిల నడుమ ప్రాకృతిక ప్రేమ గాథ చెంచు లక్ష్మి అలరించింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. కళను విద్యాసేవతో మిళితం చేస్తూ...ఈ సాయంత్రం ద్వారా సమీకరించిన నిధులను ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్(FCEF)కు అందజేశారు.

హర్షిణి చుండి, శ్రీలేఖ అడుసుమిల్లిలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మాలతి నాగభైరవ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్), మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి, భారత్ గోవింద, నీలిమ గడ్డమణుగు, శ్రీరామ్ రొయ్యాల తదితరులు పాల్గొన్నారు. నీలిమ గడ్డమనుగు దర్శకత్వం వహించారు. రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్, కార్టర్ బారెట్ అతిథులుగా పాల్గొన్నారు.

Tags-Chenchu Lakshmi Dance Show In Cummings Georgia By Nataraja Natyanjali Neelima

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles