₹40కోట్లతో ఇర్వింగ్ గాంధీపార్కు సుందరీకరణ - యోగా వేడుకల్లో మేయర్ ప్రకటన

Featured Image

ఇర్వింగ్(డాలస్) నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద శనివారం నాడు మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (MGMNT) ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గంటన్నరకు పైగా సాగిన యోగా, ధ్యాన కార్యక్రమానికి ‘హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ సారధ్యం వహించింది. ఈ వేడుకకు ఇషా ఫౌండషన్, ది ఐ వై ఇసి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, వన్ ఎర్త్ వన్ చాన్స్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, డి ఎఫ్ డబ్లు హిందూ టెంపుల్ తదితర సంస్థలు సహకరించాయి.

MGMNT కార్యదర్శి రావు కల్వాల స్వాగతం పలికారు. మెమోరియల్ కో ఛైర్మన్ రాజీవ్ కామత్ శుభాకాంక్షలు తెలిపారు. తెలియజేశారు. మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ 'యోగా, ధ్యానం కేవలం జూన్ 21 న మాత్రమేగాక మన దైనందిన జీవితంలో దినచర్యలో ఒక భాగంగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకం అన్నారు.'

ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాపర్ మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అన్ని వయస్సులవారు యోగాలో పాల్గొనడం సంతోషమన్నారు. మెమోరియల్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. మెమోరియల్ కార్యవర్గ అభ్యర్థనపై స్పందితూ త్వరలో $5మిలియన్ డాలర్ల (₹40కోట్లు) నిధులతో MGMNT ఉన్న 18 ఎకరాల సుందరమైన పార్కులో వాకింగ్ ట్రాక్స్, LED విద్యుత్ దీపాలను మెరుగుపరుస్తామని ప్రకటించారు.

కాపెల్ నగర కౌన్సిల్ సభ్యులు బిజు మాథ్యూ, రమేష్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ ట్రస్టీ బోర్డ్ సభ్యుడు సురేష్ మండువ, బి.ఎన్ రావు, తయాబ్కుండావాల, రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, మహేంద్ర రావు, జె పి పాండ్య, రన్నా జానీ, అనంత్ మల్లవరపు, సురేఖా కోయ, ఉర్మిల్ షా తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-MGMNT Irving Park To Be Renovated With 5Million USD Says Mayor

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles