IITHyd-ATA స్టార్టప్ పోటీలు

Featured Image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ మరియు భారత ప్రభుత్వ MeitY స్టార్ట్‌అప్ హబ్ (MSH)తో కలిసి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) స్టార్ట్‌అప్ పోటీని నిర్వహిస్తోంది. గత పది సంవత్సరాలుగా ATA వ్యాపార అభివృద్ధి, పెట్టుబడులు, మెంటార్‌షిప్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా మరియు భారతదేశాలలో నిర్వహించిన వ్యాపార సెమినార్లు, పోటీల ద్వారా అనేక కంపెనీలకు మిలియన్ల డాలర్ల పెట్టుబడులు, మార్గదర్శకత్వం లభించాయి. ఈ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, ఈసారి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ATA వేడుకల్లో భాగంగా ఈ పోటీని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.

ఈ పోటీకి IIT హైదరాబాద్ మరియు ప్రభుత్వ రంగ సంస్థ MeitY స్టార్ట్‌అప్ హబ్ భాగస్వాములవుతున్నారు. అమెరికా, భారతదేశాలకు చెందిన పలు వెంచర్ క్యాపిటల్ సంస్థలు, వ్యాపారవేత్తలు, టెక్నాలజీ మరియు బిజినెస్ ప్రొఫెసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్టార్ట్‌అప్‌లు తమ ప్రాథమిక ప్రెజెంటేషన్ డెక్‌ను నిర్ణయించిన ప్రమాణాలతో డిసెంబర్ 6, 2025లోపు startups@ataworld.orgకు పంపాలి. అందిన దరఖాస్తుల నుంచి పది స్టార్ట్‌అప్‌లు ఎంపికవుతాయి. ఎంపికైన జట్లు డిసెంబర్ 13న IIT హైదరాబాద్ క్యాంపస్‌లో తమ ప్రెజెంటేషన్‌లు ఇస్తాయి.

జడ్జింగ్ ప్యానెల్ ఉత్తమ మూడు స్టార్ట్‌అప్‌లను ఎంపికచేసి నగదు బహుమతులు అందిస్తుంది. అదనంగా, ఈ మూడు జట్లు అమెరికాలో జరగబోయే తదుపరి పోటీలో పాల్గొనే అవకాశాన్ని పొందుతాయి. అయితే ఎంపికైన పది స్టార్ట్‌అప్‌లందరూ పెట్టుబడి మరియు మెంటార్‌షిప్‌ కోసం అర్హులవుతారు. పోటీకి సంబంధించి పూర్తి వివరాలు ATA అధికారిక వెబ్‌సైట్‌లో ataworld.org అందుబాటులో ఉన్నాయి.

ఈ కార్యక్రమాన్ని IIT హైదరాబాద్ తరఫున డైరెక్టర్ మూర్తి, ఇన్నోవేషన్ డీన్ మల్లారెడ్డి సమన్వయం చేస్తున్నారు. భారత ప్రభుత్వ MeitY స్టార్ట్‌అప్ హబ్ CEO పన్నీర్సెల్వం మదనగోపాల్ పోటీకి ముందు కీలక ప్రసంగం చేసి, ఫైనలిస్టులకు MSH వనరులను అందించనున్నట్లు తెలిపారు. ATA తరఫున జయంత్ చల్లా, సతీష్ రెడ్డి, లాక్స్ చెపురి తదితరులు సమన్వయపరుస్తున్నారు.

Tags-IIT Hyderabad and ATA Conducting Startup Competitions

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles