కేరళ కొత్త డీజీపీగా ప.గో.కి చెందిన రవాడ చంద్రశేఖర్ నియామకం

Featured Image

కేరళ ప్రభుత్వం రాష్ట్ర కొత్త పోలీస్‌ చీఫ్‌గా రవాడ ఏ చంద్రశేఖర్‌ను నియమించింది. ఢిల్లీలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన చంద్రశేఖర్‌ తన పోలీసు జీవితాన్ని కేరళలోనే మొదలుపెట్టారు. తలస్సరిలో ఏఎస్పీగా మొదటి పోస్టింగ్‌ తీసుకున్న ఆయన అనంతరం వయనాడ్‌, మలప్పురం, ఎర్నాకులం రూరల్‌, పాలక్కాడ్‌ జిల్లాల్లో ఎస్పీగా, తిరుచూర్‌ మరియు కొచ్చి పరిధుల్లో డీఐజీగా, తిరువనంతపురం కమిషనర్‌గా పనిచేశారు. 2008లో డీఐజీగా ఉన్న సమయంలో కేంద్రానికి డిప్యూటేషన్‌ వెళ్లారు.

కేంద్ర కేబినేట్‌లో సెక్రటరీ (సెక్యూరిటీ)గా కూడా ఎంపిక అయిన చంద్రశేఖర్ ఆ పదవిలో ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు లేకపోవడంతో, కేరళ పోలీస్ చీఫ్‌గా చేరడం ద్వారా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఏడాది పొడిగింపు పొందే అవకాశం ఉన్నందున ఆయన డీజీపీ బాధ్యతల పట్ల తన ఆసక్తిని ముఖ్యమంత్రి పినరై విజయన్‌కు నివేదించారు. దీనితో కేరళ ప్రభుత్వం ఆయన్ను ఆ రాష్ట్రానికి 41వ డీజీపీగా ఖరారు చేసింది.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Telugu Origin Ravada Chandrasekhar Appointed As Kerala DGP

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles