వేడుకగా డెట్రాయిట్ తెలుగు సంఘ దీపావళి సంబరం

Featured Image

డెట్రాయిట్ తెలుగు సంఘం(DTA) 2025 దీపావళి సంబరాలు వైభవంగా నిర్వహించారు. 40కు పైగా సాంస్కృతిక కార్యక్రమాల్లో 200 మంది స్థానిక ప్రవాస యువత చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

DTA వడ్లమూడి వెంకటరత్నం పురస్కారాన్ని మాజీ అధ్యల్షుడు ఆత్మకూరి సంతోష్, కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డు రాజా దురైరాజన్, ఆనంద్ కుమార్, యూత్ కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డును కోనేరు చంద్రవదనకు అందజేశారు.

అధ్యక్షురాలు గడ్డం శుభ్రత, కార్యదర్శి తొట్టెంపూడి రాజ, మాజీ అధ్యక్షులు పెద్దిబోయిన జోగేశ్వరరావు, నీలిమ మన్నే, రమణ ముదిగంట, కిరణ్ దుగ్గిరాల, పంట్ర సునీల్, ప్రవాస భారతీయ సంఘాలు ట్రాయి తెలుగు సంఘం, డెట్రాయిట్ తెలంగాణా కమ్యూనిటీ, కేరళ సంఘం, NRIVA, గ్లోబల్ తెలంగాణా సంఘం, తానా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags-Detroit Telugu Assoc DTA Diwali 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles