తానా ఫౌండేషన్‌ ట్రస్టీగా పెనమలూరు ప్రవాసాంధ్రుడు ఠాగూర్‌ మల్లినేని

Featured Image

పెనమలూరుకు చెందిన ప్రవాసాంధ్రుడు ఠాగూర్‌ మల్లినేని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సేవా విభాగం ఫౌండేషన్‌లో ట్రస్టీగా ఎంపికయ్యారు. 2025-29 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

తానా ఫౌండేషన్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదలకు, రైతులకు, విద్యార్థులకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని, గతంలో కూడా పెనమలూరుకు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించానని, ఇప్పుడు ఫౌండేషన్‌ ట్రస్టీగా పెనమలూరులోని పేదలకు మరింతగా సహాయాన్ని చేస్తానని చెప్పారు. ఉచిత నేత్ర వైద్యచికిత్స శిబిరాల ఏర్పాటు, విద్యార్థులకు ఉపకారవేతనాల వంటి వాటి కోసం కృషి చేస్తానని ఆయన హామి ఇచ్చారు. కాగా ఆయన ఎంపిక పట్ల పెనమలూరులోని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Penamaluru NRI Tagore Mallineni Selected As TANA Foundation Trustee

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles