స్కాట్లాండ్‌లో చిన్నజీయర్ తొలి పర్యటన

Featured Image

ఆదివారం నాడు స్కాట్లాండ్‌లోని బో’నెస్ టౌన్ హాల్‌లో చిన్న జీయర్ స్వామి తొలిసారి ఉపన్యాసం నిర్వహించారు. భువన విజయం సంస్థ, JET UK సంయుక్తంగా నిర్వహించిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో 500 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. స్వామికి ఘనంగా సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు.

ఊరేగింపు కార్యక్రమంలో విజయ్ కుమార్ రాజు పర్రి పూలమాల సమర్పించగా, అర్జున్ రాజు పర్రి స్కాటిష్ బ్యాగ్‌పైప్ ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రసాద్ మంగళంపల్లి, శ్రీహరి వల్లభజౌస్యులలు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సాయి దొడ్డ సమూహం కోలాటం ప్రదర్శించగా, పిల్లల సంయుక్త నృత్యం, శైలజ గంటి, హిమబిందు జయంతి, మమత వుసికల నిర్వహించిన మంగళ ఆరతులు వేడుకకు అందాన్ని తీసుకువచ్చాయి. కార్యక్రమాన్ని రంజిత్ నాగుబండి సమన్వయపరిచారు. మిథిలేష్ వద్దిపర్తి వ్యాఖ్యాతగా పనిచేశారు.

Ego, Equality & Eternity — A Journey from Self to Supreme అనే ఉపన్యాసంలో చిన్నజీయర్ సమానత్వం, శాశ్వతత్వం గురించి ఆధునిక దృష్టితో విశ్లేషించారు. భువన విజయం సంస్థ ఐదున్నర శతాబ్దాల తర్వాత సభ వైభవాన్ని పునరుజ్జీవింపజేయడం అద్భుతమని పేర్కొన్నారు. రాజశేఖర్ జాల, JET UK వారితో సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వేదికపై కుచిపూడి, రామ సంకీర్తన, వీణా వాయిద్యం, పిల్లల శ్లోకాలు అలరించాయి. కోదండరావు వ్రాసిన పద్యాలను భువన విజయం సభ్యులు స్వామికి బహూకరించారు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Chinnajeeyar Swamyji First Scotland Tour 2025 JETUK

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles