యూకె హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఉదయ్‌కు అభినందనలు

Featured Image

తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నియమితులవడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఉదయ్ నాగరాజును కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఉదయ్ నాగరాజుతో నాకు ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉంది. అనేక సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో కలిసి పని చేశాం. ఈ రోజు ఒక తెలుగువాడిగా ఆయన ఇంతటి గొప్ప స్థానానికి చేరుకోవడం గర్వకారణం. అంతేకాకుండా, నాగరాజు పీవీ కుటుంబానికి కూడా ఎంతో ఆత్మీయుడిగా ఉండటం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.

ఉదయ్ నాగరాజు యూకేలో దాదాపు దశాబ్దకాలంగా పల్లెస్థాయి నుంచి ప్రజలతో మమేకమై పనిచేస్తూ, స్కూల్ గవర్నర్‌గా, వాలంటీర్‌గా, రాజకీయ కార్యకర్తగా సేవలందించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, వారి ఆశయాలు, ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ నుంచి వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉదయ్ నాగరాజు ఘనతపై పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

Tags-Mahesh Bigala Meets With UK House of Lords Member Uday Nagaraju

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles