తెలంగాణా ప్రభుత్వ సలహాదారునిగా డా. నోరి

Featured Image

అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన కేన్సర్ నిపుణుడు డా. నోరి దత్తాత్రేయుడు తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా నియమితులయ్యారు. బ్రాకి థెరపీ, రేడియేషన్ థెరపీల ద్వారా కేన్సర్ చికిత్సలో విశేష నైపుణ్యం కలిగిన డా. నోరి దత్తాత్రేయుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి క్యాన్సర్ నివారణ, చికిత్స మరియు అందుబాటులో ఉన్న కేన్సర్ సేవలపై దిశనిర్దేశం చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు జూన్ 28న ఉత్తర్వులు జారీ చేశారు.

డా. నోరి అమెరికాలో స్థిరపడిన ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్. దశాబ్దాల పాటు క్యాన్సర్ వ్యాధి నియంత్రణలో విశేష సేవలు అందించారు. ఆయన సేవలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇలాంటి కీలక పదవికి ఇదే ఏడాది మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డా. నోరిని కేన్సర్ సేవలపై సలహాదారుగా నియమించింది. రెండు తెలుగు రాష్ట్రాలూ ఆయన సేవలను వినియోగించుకోవడం గర్వకారణమని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Nori Dattatreyudu Appointed Advisor to Telangana Govt

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles