బాల్టిమోర్‌లో 19వ ATA మహాసభలు నిర్వహణకు బోర్డు ఆమోదం

Featured Image

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) బోర్డు సమావేశం జూన్ 28, 2025న న్యూజెర్సీలోని APA హోటల్ వుడ్‌బ్రిడ్జ్‌లో నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలు, రాబోయే ప్రాధాన్యాలపై చర్చించారు. 19వ ఆటా మహాసభలు జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించేందుకు బొర్డు ఆమోదముద్ర వేసింది.

అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ సంస్థ ఇటీవల చేపట్టిన ముఖ్య కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా IIT హైదరాబాద్‌తో కలిసి విద్యా కార్యక్రమాల అభివృద్ధికి భాగస్వామ్యం, 12 అమెరికన్ నగరాలలో మాతృదినోత్సవం, మహిళల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ATA డేస్, క్రీడా కార్యక్రమాలు, 5K పరుగులు, యోగా సెషన్లు, స్వచ్ఛతా కార్యక్రమాల ద్వారా సంస్థ సామాజిక సేవలో ముందుందని కొనియాడారు. విద్యార్ధులకు ఉపయుక్తంగా SAT ప్రిపరేషన్ కోర్సులు, IT శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించారని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రవాసుల మద్దతుతో క్లీన్ వాటర్ ప్రాజెక్ట్స్ చేపడుతున్నట్టు తెలిపారు. Agribridge రూపొందించిన AI ఆధారిత మొబైల్ యాప్ కృష్ణివాస్ ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కార్యదర్శి సాయినాథ్ బోయపల్లి, కోశాధికారి శ్రీకాంత్ గుడిపాటి నివేదికలను సమర్పించారు. ATA ఆర్థిక విషయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. ATA తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 2025లో ATA సేవా దినోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

సంయుక్త కార్యదర్శి శారద సింగిరెడ్డి, సంయుక్త కోశాధికారి విజయ్ రెడ్డి తుప్పల్లి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సి రెడ్డి గడ్డికొప్పుల, ట్రస్టీ సభ్యులు కశివిశ్వనాథ్ కోత, కిషోర్ గుదురు, మహీధర్ ముస్కుల, నర్సింహా రెడ్డి ధ్యాసాని, రఘువీర్ మారిపెడ్డి, రాజు కాకర్ల, రామ్ మట్టపల్లి, రామకృష్ణ రెడ్డి అలా, RV రెడ్డి, సంతోష్ కొరాం, శ్రీధర్ కంచనకుంట్ల, శ్రీధర్ బనాల, శ్రీనివాస్ దార్గులా, సుధీర్ బండారు, వెంకట్రామ్ రెడ్డి రవి, విజయ్ కుండూర్, వినోద్ కొడురు, విష్ణు మాధవరాం తదితరులు పాల్గొన్నారు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-New Jersey ATA Board Meeting 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles