గ్రామీణ విద్యార్థులకు ఐఐటీ సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై శిక్షణ

Featured Image

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఐఐటీల సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేథలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రాథమికంగా చర్చించినట్లు గుంటూరులోని FAANG Tech సంస్థ నిర్వాహకులు కొల్లా అశోక్‌బాబు, జిల్లెళ్లమూడి వెంకట్‌లు తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయని, ఆయా ఉద్యోగవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగేలా గ్రామీణ ప్రాంత విద్యార్థినీ విద్యార్థులకు తమ సంస్థ ద్వారా నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

సోమవారం నాడు విజయవాడలోని నోవాటెల్‌లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతిలకు చెందిన డా.కామకోటి, డా. సత్యనారాయణలతో అశోక్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ఐఐటీ బోధనా పద్ధతులను, పాఠ్యాంశాలను అధ్యయనం చేసి తమ సంస్థ FAANG Tech ద్వారా విద్యార్థులకు శిక్షణనిచ్చి వారికి ఉజ్జ్వల భవిత అందించేందుకు కలిసి పనిచేసే అవకాశాలను చర్చించామని వెల్లడించారు. 2026 జనవరి కల్లా 1000మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులను క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేథపై నిష్ణాతులుగా తయారు చేసే విధంగా తమ సంస్థ ముందడుగు వేస్తోందని తెలిపారు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-FAANG Tech Quantum Computing Training To Rural Students Via IIT Support

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles