తానా మిడ్‌-అట్లాంటిక్‌ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్‌-అట్లాంటిక్‌ ఆధ్వర్యంలో ఆదివారం నాడు పెన్సిల్వేనియాలోని హనీ బ్రూక్‌, చెస్ట్‌నట్‌ రిడ్జ్‌లో యూత్‌ ఫుడ్‌ డ్రైవ్‌ 2025 కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. పెద్ద మొత్తంలో ఆహారాన్ని సేకరించారు. డిసెంబర్‌ 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సేకరించిన విరాళాలన్నీ చెస్టర్‌ కౌంటీ ఫుడ్‌ బ్యాంక్‌కు అందిస్తామని తానా ప్రతినిధులు తెలిపారు.

తానా బోర్డ్‌ డైరెక్టర్‌ రవి పొట్లూరి, మిడ్‌-అట్లాంటిక్‌ రీజినల్‌ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్స్‌ కోఆర్డినేటర్‌ వెంకట్‌ సింగు, ఫుడ్‌ డ్రైవ్‌ కోఆర్డినేటర్‌ గోపి వాగ్వాల, యూత్‌ ఫుడ్‌ డ్రైవ్‌ ఛైర్మన్లు వ్యోమ్‌ కొత్తపల్లి, సోహన్‌ సింగులు పాల్గొన్నారు. రాధాకృష్ణ ముల్పూరి ఈ ఆహార సేకరణను సమన్వయపరిచారు. 2500 కిలోల ఆహారాన్ని సేకరించాలనే లక్ష్యంతో వాలంటీర్లు పనిచేస్తున్నారు.

Tags-TANA Mid-Atlantic Food Drive To Help Needy

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles