ఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతి

🕑 Published: June 16, 2026 at 09:35 AM CST

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నెదర్లాండ్స్‌ ఎన్నారై తెదేపా కార్యదర్శి వెంకట్ కృష్ణ కోక, నవీన్ ఆచంట సమన్వయపరిచారు. ఈ సందర్బంగా గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని గుర్తించిన ఎన్టీఆర్‌ తెలుగును ప్రోత్సహించారన్నారు. యూరప్‌లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ఆయన ఆశయాలకనుగుణంగా తమ పిల్లలను అమెరికాలోని సిలికానాంధ్ర వారి తోడ్పాటుతో చక్కటి తెలుగు నేర్పిస్తున్నారని తెలిపారు. మాతృభూమికి దూరమైన మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని కొనియాడారు. నెదర్లాండ్స్‌లో మనబడి ద్వారా 25 మంది వాలంటీర్లుగా ఏర్పడి 280 మందికి తెలుగు నేర్పించడం గర్వకారణమన్నారు. మాతృభాషను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఐరోపా ఖండంలో తెలుగు వెలుగుల్ని విరజిమ్ముతున్న తెలుగు వారందరికీ అభినందనలు తెలియజేశారు.

సంపత్ ఐనంపూడి మాట్లాడుతూ.. ‘మా పిల్లలు తెలుగు భాషతో పాటు స్కూళ్లలో డచ్, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ తదితర భాషలను కూడా నేర్చుకుంటారు. భౌగోళిక సరిహద్దులు భాషకు ప్రతిబంధకాలు కావని మా పిల్లలు నిరూపిస్తున్నారు. భాష సాంస్కృతిక వారధి. అలాంటి వారసత్వ సంపదను పదిలంగా ఉంచుకుంటున్నాం’’ అని తెలిపారు. అనంతరం సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నడుస్తున్న మనబడి బోధనా కేంద్రాన్ని సందర్శించి అక్కడి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్‌ ఎన్నారై తెదేపా అధ్యక్షుడు వివేక్ కరియావుల, ఆచంట గోపాలరావు, సత్యనారాయణ సలకి, అమర్ చంద్ రావి, వివేక్ కరియావుల, ప్రసాద్ రామినేని, పవన్ గుమ్మడి , ప్రవీణ్ ముమ్మినేని, చైతన్య వెల్లంకి, నవీన్ పరుచూరి, ఫణీష్ పోతురాజు, నంద ఉదయగిరి తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళంఆల్ఫరెట్టాలో గ్లోబల్ తెలంగాణా సంఘం అంతర్జాతీయ ఉత్సవంకువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరంAttention USA Parents - ATA SAT Coaching 2026 - Registration Now Open!ఎన్‌టీఆర్‌కు ఆస్టిన్ ప్రవాసుల ఘన నివాళిడెన్మార్క్‌లో మినీ మహానాడు విజయవంతంజర్మనీలో బాలకృష్ణ జన్మదిన వేడుకలులోకేశ్ ఓఎస్డీ డా.వరప్రసాద్‌కు రెండు బంగారు పతకాలుచికాగోలో గాయపడిన స్పందనకు "ఆటా" చేయూతఐఐటీఎం ప్రవర్తక్‌తో "టెక్‌సొరా" ఒప్పందంఅమెరికాలోని తెలుగు విద్యార్థులకు రూపాయి శాపంసాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృత భాష అధ్యయనం తప్పనిసరివనపర్తి జిల్లాలో మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకు భువనేశ్ తోడ్పాటుజర్మనీలో ఘనంగా మినీ మహానాడుAPTS ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ శిక్షణఎన్నారైలకు తితిదే గుడ్ న్యూస్...ఇక 90రోజులుమలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధంస్కాట్‌ల్యాండ్‌లో ఘనంగా మినీ మహానాడుఐ ఫౌండెషన్ ఆఫ్ అమెరికాకు నాట్స్ భారీ విరాళండల్లాస్‌లో కోమటి జయరాంకు సత్కారం
Previous Article Next Article