🕑 Published: November 11, 2026 at 09:16 AM CST
తెలుగు మహిళలు, బాలికల కోసం సిడ్నీలో తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు మూడు యోగా శిక్షణ తరగతులు విజయవంతంగా పూర్తి చేశారు. యోగా సాధన తమ దైనందిన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని, మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, పని-వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత సాధించడానికి దోహదపడుతోందని మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈషా ఫౌండేషన్ శిక్షకులు తరగతులు నిర్వహిస్తున్నారు. నవంబర్ 21వ తేదీన చివరి సెషన్ నిర్వహించనున్నారు.
