USA..డల్లాస్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్ పర్యటన

🕑 Published: November 11, 2026 at 09:22 AM CST

ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఛైర్మన్ శ్రీనివాసులుశెట్టి అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ పరిసర ప్రాంతమైన అర్వింగ్‌లోని మహాత్మగాంధీ స్మారకస్థలిని సందర్శించి గాంధీజికి నివాళి అర్పించారు. ఫ్రిస్కో నగరంలో ఇటీవలే ఎస్‌బీఐ బ్రాంచిని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. 18ఎకరాల విస్తీర్ణంలో అమెరికాలోనే మహాత్ముని అతిపెద్ద స్మారకస్థలిని రూపొందించిన కమిటీ సభ్యులను శ్రీనివాసులు అభినందించారు. 12వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్మారకస్థలి కమిటీ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వల, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ అధ్యక్షుడు మహేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా పెదపోతులపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి స్టేట్ బ్యాంకులో సాధారణ ఉద్యోగిగా జేరి అంచలంచెలుగా ఎదిగి ఛైర్మన్ స్థాయికి చేరుకున్నారు. 2024లో భారత ప్రభుత్వంచే నియమింపబడిన ఆయన 2027 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

📲 Join Our WhatsApp Channel
Australia..తెలుగుదేశం ఆధ్వర్యంలో యోగా తరగతులుLondon..లండన్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర ఎన్నికUSA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో సంగీత-నృత్య కార్యక్రమంMalaysia..ఉత్సాహంగా 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్USA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణUSA..లాస్‌వేగాస్‌లో SJMIT పూర్వ విద్యార్థుల సమావేశంSingapore..రక్తదానం చేసిన 50 మంది ప్రవాసులురాజీలేని పాలన సాగించిన జగన్ - డల్లాస్‌లో ధనంజయరెడ్డితానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం..అవధాన గురుభ్యోనమఃవైకాపా అమెరికా సలహాదారులుగా 8మంది నియామకం36 Students Receive White Coats at St Martinus University in CuraçaoGlobal Telangana Association GTA Mega Batukamma In Virginiaవైభవంగా సాగిన టాంటెక్స్ 40వ వార్షికోత్సవంలండన్‌..వైభవంగా క్రొయ్దన్ తెలుగు సంఘం బతుకమ్మ-దసరాషాంఘై ప్రపంచ తెలుగు సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్న హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య సభ్యులుడెట్రాయిట్‌లో ఘనంగా జరిగిన GTA బతుకమ్మ-దసరావర్జీనియాలో AAVGF అవగాహన సదస్సుఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువచైనాలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుడిస్నీ దీపావళి వేడుకల్లో తొలిసారిగా కూచిపూడి నాట్యప్రదర్శన
❮ No Previous Next Article ❯