🕑 Published: November 15, 2026 at 02:25 PM CST
సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు డాక్టర్ మురళి గింజుపల్లి తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన సైన్స్ ఫిక్షన్ విభాగంలో The Fractured Flatland శీర్షికతో రాసిన నవలలో ఊహాశక్తి, రహస్యాలు, భవిష్యత్ నాగరికతల నేపథ్యంలో సాగుతుంది. డన్మారో ప్రాంతంలో బావులు ఒక్కొక్కటిగా ఎండిపోతుండటంతో అసలు కారణాన్ని అన్వేషించే ఆరిన్ వేల్ అనే వాటర్ సర్వేయర్ ప్రయాణం ఈ కథకు కేంద్రబిందువు. ఈ పుస్తకాన్ని ChandoooG అనే కలం పేరుతో ప్రచురించారు.
పుస్తకం: The Fractured Flatland
Amazon: https://www.amazon.com/dp/B0HP17Z3Q4
ఆధ్యాత్మిక సాహిత్య విభాగంలో Sai Satcharitra of Sai Samaj of Saginaw పేరుతో రచించిన పుస్తకంలో మిషిగన్ రాష్ట్రం సాగినాలో సాయి సమాజం ఆవిర్భావం, అభివృద్ధి, భక్తి ప్రయాణాన్ని వివరించారు. 2021 నుంచి 2025 వరకు సాయిబాబా ఆలయాన్ని ఏర్పాటు చేయాలనే సమాజ సభ్యుల సంకల్పం, వారి అనుభవాలు, ఎదురైన సవాళ్లు, అనుకోకుండా లభించిన ఆశీస్సులు ఈ పుస్తకంలో పొందుపరిచారు.
పుస్తకం: Sai Satcharitra of Sai Samaj of Saginaw
Amazon: https://www.amazon.com/dp/B0HQK8RMFV
కథలు చెప్పాలనే ఆసక్తి తనకు ఎప్పటి నుంచో ఉందని, అది ఈ పుస్తకాల రూపంలో పాఠకులకు చేరువ కావడం ఆనందంగా ఉందని మురళీ తెలిపారు.
