USA..$45వేల డాలర్లు సేకరించిన శంకర నేత్రాలయ

🕑 Published: November 19, 2026 at 04:03 PM CST

అంధత్వ నివారణే లక్ష్యంగా, గ్రామీణ భారతదేశంలోని నిరుపేదలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందిస్తున్న శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు అమెరికాలోని సియాటిల్ ప్రవాసులు 45వేల డాలర్లను విరాళంగా అందజేశారు. అక్టోబర్ 31వ తేదీన బెల్లేవ్యూ నగరంలో ఉన్న వాసా పార్క్ రిసార్ట్‌లో నిర్వహించిన సంగీత విభావరి ద్వారా ఈ నిధులను సేకరించారు.

రాము, అంజనా సౌమ్య తమ గానంతో అలరించారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన 45 వేల డాలర్ల విరాళాలతో శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (ంఏశూ), అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమాల ద్వారా మూడు గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సుహాగ్ గండికోట, నందకిశోర్ గాజుల, రామ్ కొట్టి ప్రధాన దాతలుగా నిలిచి ఉదారంగా విరాళాలు అందించారు. WATS, WATA, WAIA, SWECHA సంస్థలు సంయుక్తంగా 5వేల డాలర్ల అందజేశాయి.

శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ ఎస్.ఎస్. బద్రీనాథ్ సేవా సంకల్పాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. శంకర నేత్రాలయ యూఎస్ఏ వ్యవస్థాపకుడు, పూర్వ అధ్యక్షుడు ఎస్.వి.ఆచార్య, ప్రస్తుత అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి, కోశాధికారి మూర్తి రేకపల్లి, ట్రస్టీలు సోమ జగదీశ్ పెతకంశెట్టి, వినోద్ పర్నా, సీవీపీ జయపాల్ రెడ్డి దొడ్డా, చాప్టర్ ప్రతినిధులు రాజశేఖర్ చెన్నుపాటి, అనిల్ కుమార్ జామి, శశి యేజియు, మోహన్ మద్ది, అరుణ్ కుమార్ అనపర్తి, శ్యామ్ అప్పాలి, వంశీకృష్ణ ఎరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, రత్నకుమార్ కావుటూరు, గిరి కోటగిరిలు సహకరించారు.

www.sankaranethralayausa.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా (855) 463-8472 నంబర్‌లో సంప్రదించవచ్చు.

📲 Join Our WhatsApp Channel
USA..కాలేజ్‌విల్‌లో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలుUSA..ఫ్రిస్కోలో అలరించిన శుభం ఫౌండేషన్ సంగీత విభావరిఇంజనీరింగ్ విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన పొట్లూరి రవిBahrain..బెహ్రెయిన్‌లో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవంTelugu Association of London TAL Celebrates 2026 Childrens Dayరచయితగా మారిన డా. గింజుపల్లి మురళి. రెండు పుస్తకాలు విడుదల.Canada..టొరంటోలో తాకా దీపావళి ధమాకాUSA..డల్లాస్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్ పర్యటనAustralia..తెలుగుదేశం ఆధ్వర్యంలో యోగా తరగతులుLondon..లండన్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర ఎన్నికUSA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో సంగీత-నృత్య కార్యక్రమంMalaysia..ఉత్సాహంగా 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్USA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణUSA..లాస్‌వేగాస్‌లో SJMIT పూర్వ విద్యార్థుల సమావేశంSingapore..రక్తదానం చేసిన 50 మంది ప్రవాసులురాజీలేని పాలన సాగించిన జగన్ - డల్లాస్‌లో ధనంజయరెడ్డితానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం..అవధాన గురుభ్యోనమఃవైకాపా అమెరికా సలహాదారులుగా 8మంది నియామకం36 Students Receive White Coats at St Martinus University in CuraçaoGlobal Telangana Association GTA Mega Batukamma In Virginia
❮ Previous Article Next Article ❯