Netherlands..కమనీయంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం

🕑 Published: November 19, 2026 at 04:10 PM CST

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వసుదైవ కుటుంబం(SVK) ఆధ్వర్యంలో ఐండ్‌హోవెన్‌లోని బాలాజీ ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నెదర్లాండ్స్ నలుమూలల నుండి 1300 మంది భక్తులు పాల్గొన్నారు. వేదపండితుల ఆధ్వర్యంలో, సుప్రభాత సేవతో ప్రారంభమై, తోమాల సేవ, అర్చన జరిగాయి. అనంతరం సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై, వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాల మధ్య స్వామివారి కళ్యాణం, వస్త్ర సమర్పణ కన్నుల పండువగా జరిగాయి. తిరుమలలో జరిగే కళ్యాణోత్సవాన్ని తలపించింది.

నెదర్లాండ్స్‌లోని ప్రతి భారతీయ కుటుంబానికి స్వామివారి సేవ, దర్శనం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో SVK పనిచేస్తోందని నిర్వాహకులు తెలిపారు. 2022లో మొదటి శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని ప్రారంభించి నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఐరోపాలో పరిరక్షిస్తూ, ముందుకు తీసుకువెళ్తున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్(TANE), Shrigandha, SAMUKA, EMM, HSS Netherlands వంటి ప్రవాస భారతీయ సంస్థలు సహకరిస్తున్నాయి. ఆలయ కార్యక్రమాలు, సేవల వివరాల కోసం: https://sribalajitemple-eu.org

📲 Join Our WhatsApp Channel
USA..$45వేల డాలర్లు సేకరించిన శంకర నేత్రాలయUSA..కాలేజ్‌విల్‌లో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలుUSA..ఫ్రిస్కోలో అలరించిన శుభం ఫౌండేషన్ సంగీత విభావరిఇంజనీరింగ్ విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన పొట్లూరి రవిBahrain..బెహ్రెయిన్‌లో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవంTelugu Association of London TAL Celebrates 2026 Childrens Dayరచయితగా మారిన డా. గింజుపల్లి మురళి. రెండు పుస్తకాలు విడుదల.Canada..టొరంటోలో తాకా దీపావళి ధమాకాUSA..డల్లాస్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్ పర్యటనAustralia..తెలుగుదేశం ఆధ్వర్యంలో యోగా తరగతులుLondon..లండన్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర ఎన్నికUSA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో సంగీత-నృత్య కార్యక్రమంMalaysia..ఉత్సాహంగా 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్USA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణUSA..లాస్‌వేగాస్‌లో SJMIT పూర్వ విద్యార్థుల సమావేశంSingapore..రక్తదానం చేసిన 50 మంది ప్రవాసులురాజీలేని పాలన సాగించిన జగన్ - డల్లాస్‌లో ధనంజయరెడ్డితానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం..అవధాన గురుభ్యోనమఃవైకాపా అమెరికా సలహాదారులుగా 8మంది నియామకం36 Students Receive White Coats at St Martinus University in Curaçao
❮ No Previous Next Article ❯