🕑 Published: November 01, 2026 at 07:20 PM CST
చిత్రదుర్గలోని ఎస్‌జేఎంఐటీ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో శనివారం నాడు ఆనందోత్సాహాల నడుమ జరిగింది. కళాశాలతో అనుబంధం ఉన్న సుమారు 200 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని, తమ కళాశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1980లో ప్రారంభమైన ఎస్‌జేఎంఐటీ కళాశాలలో తమ గురువులు, స్నేహితులను ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు. నాటి సరదా సంఘటనలు, అనుభవాలను పరస్పరం పంచుకున్నారు.
వెనిగళ్ళ రవికుమార్ చొరవతో రూపొందిన కార్యక్రమాన్ని వెంకట్ మలపాటి, భక్త బల్లా, మాదల శ్రీనివాస్, శ్రీధర్ గోనుగుంట్ల, శ్రీనివాస్ గొంది ప్రవీణ్ రెడ్డి, పాపిరెడ్డి, శరత్ పున్‌రెడ్డి, వంశీ గరికపాటి, శ్రీనివాస్ రెడ్డి ఎర్ర, చంద్ర రాగ్యారి, కృష్ణ పూర్రు సమన్వయపరిచారు.




