వాషింగ్టన్ డీసీలో డా.సి.నారాయణరెడ్డి 94వ జయంతి వేడుకలు

Featured Image

ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా. సి.నారాయణ రెడ్డి 94వ జయంతిని అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డి.సిలో ఘనంగా నిర్వహించారు. తానా-పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా దివాకర్ల రాజేశ్వరి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..రాజ్యసభ సభ్యులుగా, అధికార భాషా సంఘ అధ్యక్షులుగా, సినీ గేయ రచయితగా సి.నా.రె పలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. తెలుగు సాహిత్యంలో, మకుటం లేని మహారాజుగా వెలుగొందారని..తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించటమే కాక, అనేక నూతన ప్రక్రియలను ఆవిష్కరించి, తెలుగు సాహితీ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. మానవుడు ప్రకృతిపై ఆధిపత్యం సాధించాలనే తపన అనేక అనర్థాలకు కారణమయిందనే విషయాన్ని అందుకే ప్రకృతితో మమేకమై సమతాస్థితిని సాధించటమే ఆయన రచించిన విశ్వంభర మనకిచ్చే అమూల్య సందేశమని వెల్లడించారు. తెలుగు సాహితి రంగాన్ని సినారె సుసంపన్నం చేశారన్నారు.

నక్షత్రం వేణు, పయ్యావుల చక్రవర్తి, చామర్తి శ్రావ్య, కొత్తూరి కామేశ్వరరావు, బోనాల రామకృష్ణ, పునుగువారి నాగిరెడ్డి, బండి సత్తిబాబు, దుగ్గి విజయభాస్కర్, చల్లా సుబ్బారావు, చిట్టెపు సుబ్బారావు, చెరుకూరి ప్రసాద్, వనమా లక్ష్మినారాయణ, మేకల సంతోష్ రెడ్డి, సామినేని వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.

Tags-C Narayana Reddy Jayanthi 2025 In Washington DC

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles